Header Banner

సక్సెస్ అంటే విజయం కాదు.. దాదాపు రెండేళ్లుగా! సమంత పలు ఆసక్తికర విషయాలు!

  Sat Jun 14, 2025 09:41        Environment

ప్రముఖ కథానాయిక సమంత తన దృష్టిలో విజయం అంటే స్వేచ్ఛను పొందడమేనని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకున్నట్టు భావిస్తున్నానని తెలిపారు. దాదాపు రెండేళ్ల విరామం అనంతరం సినిమాల్లో తన ప్రయాణం, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయం గురించి తన అభిప్రాయాన్ని వివరిస్తూ "విజయానికి నిర్వచనం ఏమిటని అడిగితే నేను వెంటనే స్వేచ్ఛ అని చెబుతాను. నిరంతరం అభివృద్ధి చెందడం, పరిణితి సాధించడం, దేనికీ బందీగా ఉండకపోవడమే నా దృష్టిలో నిజమైన స్వేచ్ఛ. అదే అసలైన విజయం" అని సమంత పేర్కొన్నారు. గత రెండేళ్లుగా తన సినిమా ఏదీ విడుదల కాకపోయినా, ఈ విరామ సమయంలో తాను ఎంతో స్వేచ్ఛగా ఉన్నానని ఆమె తెలిపారు. "బహుశా నా చుట్టూ ఉన్నవారు, గతంతో పోలిస్తే నేనిప్పుడు విజయం సాధించలేదని అనుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి: తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

కానీ, నా వ్యక్తిగత దృష్టిలో మాత్రం నేను గతం కంటే ఎక్కువ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. నేను ప్రస్తుతం చేస్తున్న పనులు నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. వాటిని పూర్తి చేయడం కోసం ప్రతిరోజూ ఎంతో ఆనందంగా నిద్రలేస్తున్నాను" అని సమంత వివరించారు. సినిమాల విషయానికొస్తే సమంత పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో కనిపించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఇటీవల విడుదలైన ‘శుభం’ చిత్రంలో ఆమె మాతాజీ అనే ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాతో సమంత తొలిసారిగా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే మరిన్ని వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తానని సమంత ఇటీవల అభిమానులకు హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Samantha #Samantha Ruth Prabhu #actress Samantha #Success #Shubham Movie #Ma Inti Bangaram #Samantha production #Tollywood #actress #interview #freedom